ముగిసిన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..

ముగిసిన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..

యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం (ఫిబ్రవరి 13) ఘనంగా ముగిశాయి. అష్టోత్తర శతఘటాభిషేకము, మహాదాశీర్వచనం, పండిత సన్మానం తో ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు అర్చకులు. ఈ ఉత్సవాలలో ఆలయ ఈఓ భాస్కర్ రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. 

పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8న ప్రారంభమయ్యాయి. ముందుగా అర్చకులు పవిత్ర జలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసి, లక్ష్మీనారసింహులకు రక్షాబంధనం చేశారు. తర్వాత ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగళ్‌‌‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో స్వస్తివాచనం, రక్షాబంధనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, సాయంత్రం అంకురారోపణం, మృత్సంగ్రహణం నిర్వహించారు.

ALSO READ | నారసింహుడికి ‘చక్రస్నానం’.. వైభవంగా జరుగుతున్న పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

ఆ విధంగా వారం రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన అనంతరం, గురువారం అష్టోత్తర శతఘటాభిషేకము, మహాదాశీర్వచనం, పండిత సన్మానం తో ఉత్సవాలను ముగించారు.