మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు యాదగిరి గుట్ట సిద్దం

మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు యాదగిరి గుట్ట సిద్దం

యాదగిరి నర్సన్న స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు గుట్ట ముస్తాబైంది. ఇయ్యాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలను వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. తొలిరోజు స్వర్ణ విమాన మహాకుంభ సంప్రోక్షణ పూజలకు అంకురార్పణ చేయనున్నారు. 

108 మంది రుత్వికులు, పారాయణీకులు, వేదపండితుల మూల మంత్ర, మూర్తి మంత్రి మంత్రోచ్ఛారణల నడుమ కొనసాగించనున్నారు. ఇందుకు ప్రధానాలయ ఈశాన్య దిశలో యాగశాలను సిద్ధం చేశారు. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు.  స్వర్ణవిమాన గోపుర కుంభ సంప్రోక్షణ వేడుకలతో గుట్ట విద్యుత్ కాంతులతో ఉత్సవ శోభను సంతరించుకుంది.    - యాదగిరిగుట్ట, వెలుగు