
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 65 రోజుల్లో యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో4 కోట్ల 43 లక్షల 4 వేల 995 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. కానుకల రూపంలో 296 గ్రాముల బంగారం, 13 కిలోల వెండిని కూడా భక్తులు సమర్పించారని వెల్లడించారు. అదేవిధంగా విదేశీ కరెన్సీ కూడా వచ్చిందని పేర్కొన్నారు.
వారాంతాల్లో, సెలవు రోజుల్లో భక్తులు భారీగా తరలివస్తుండడంతో ఆలయానికి రద్దీ పెరుగుతోంది. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేసి మొక్కు తీర్చుకుంటుండడంతో ఆలయానికి భారీ ఆదాయం సమకూరుతోంది. మన డబ్బులతోపాటు విదేశీ నగదును కూడా భక్తులు సమర్పించారు. అలాగే ఆభరణాలను సైతం ఆలయ హుండీకి సమర్పించారు.
ALSO READ | సీఎం అలా ఎలా మాట్లాడుతారు..? స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్, ఎంఐఎం నిరసన