యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. మూడో రోజు మత్స్యావతారంలో స్వామి దర్శనం

యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు( Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మో త్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం ( మార్చి 13)  మత్స్య అవతారంలో( Matsya avataram) భక్తులకు(Divotees) దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్ఛరణల మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారికి పూజలు ఘనంగా నిర్వహించారు. రాత్రి 7గంటలకు శేష వాహన సేవ నిర్వహించారు. కాగా, ఆలయ మహా ఉద్ఘాటన తర్వాత రెండోసారి బ్రహోత్సవాలు జరుగుతుండగా, ఈ నెల 21 వేడుకలు కొనసాగనున్నాయి.

రాష్ట్రంలో మరో తిరుమల క్షేత్రంగా కొలువై విరాజిల్లుతున్న యాదాద్రీశుల వైభవం నలుదిశల్లోని భక్తజనులను అలరింపజేస్తుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను రెండోసారి  వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహవాచనంతో శాస్త్రోక్తంగా 11 న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ... ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో  ముగుస్తాయని' అని ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు... రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన  వేదపండితుల ద్వారా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు.  బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల(telugu States) నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.