కోల్ఇండియా ఒప్పందాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమలు చేయిస్తాం : యాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి సత్తయ్య

గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, వెలుగు : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపిస్తే సింగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేణిలో కోల్ ఇండియాకు సంబంధించిన అన్ని హామీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయిస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆ సంఘం అధ్యక్షుడు యాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి సత్తయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ1 ఏరియా వర్క్ షాప్ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ద సింగరేణి ఎన్నిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రీయింబర్స్ మెంట్ వచ్చేలా కృషి చేస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు.

కాగడా గుర్తుపై ఓటు వేసి త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ సంఘాన్ని గెలిపించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కోరారు. పిట్ కార్యదర్శి తుమ్మ గట్టయ్య, సారంగపాణి, ఆకుల హరిణ్, లక్ష్మయ్య, శ్రీనివాస్, వెంకటేశం, లక్ష్మణ్, వినయ్, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అశోక్, వినయ్ కుమార్, వినోద్ పాల్గొన్నారు.

ప్రశ్నించే వారినే ఎన్నుకోవాలి 

సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడే వారినే ఎన్నుకోవాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. డిసెంబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ 27న జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగే సింగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప్రచారంలో శుక్రవారం ఆయన ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మైన్ల వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. అధికార పార్టీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంఘాలు కేవలం పైరవీలకే పరిమితమయ్యారని ఆరోపించారు.