కరీంనగర్‌‌‌‌కు రూ.200కోట్లు కేటాయించాలి : యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: వచ్చే బడ్జెట్‌‌లో కరీంనగర్​సిటీ అభివృద్ధికి రూ.200కోట్లు కేటాయించాలని మేయర్ యాదగిరి సునీల్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సిటీలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన  హామీలు  అమలు కాకపోతే బల్దియా పక్షాన పోరాడుతామన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని  విధంగా సిటీ అభివృద్ధి కోసం నాటి సీఎం  కేసీఆర్ రూ.550కోట్లు మంజూరు చేశారని  గుర్తు  చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు  రమణారావు, కచ్చు రవి, తిరుపతి, కొండపల్లి సరిత, లీడర్లు కొండపల్లి సతీశ్‌‌, వేణు, చంద్రమౌళి  పాల్గొన్నారు.