![రూల్స్ పాటించని లాడ్జీలను సీజ్చేస్తాం : ఏసీపీ రమేశ్ కుమార్](https://static.v6velugu.com/uploads/2024/09/yadagirigutta-acp-ramesh-kumar-warned-that-lodges-will-be-seized-do-not-follow-the-rules_WBjALmKe6p.jpg)
యాదగిరిగుట్ట, వెలుగు : రూల్స్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే లాడ్జీలను సీజ్ చేస్తామని యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్ కుమార్, సీఐ రమేశ్హెచ్చరించారు. శుక్రవారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో లాడ్జీ నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదగిరిగుట్టలో లాడ్జీలు నిర్వహిస్తున్న ఓనర్లు, లీజుదారులు తప్పనిసరిగా రిజిష్టర్లు మెయింటైన్ చేయాలని ఆదేశించారు.
అద్దె గదుల కోసం వచ్చే వ్యక్తులకు సంబంధించి అన్ని వివరాలు, ఆధారాలు సేకరించిన తర్వాతే రూములు కిరాయికి ఇవ్వాలని సూచించారు. లాడ్జీలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలన్నారు.