రాష్ట్రపతిని కలిసిన బీజేపీ లీడర్లు
యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్టకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును శుక్రవారం జిల్లా బీజేపీ లీడర్లు కలిశారు. రాష్ట్రపతిని కలిసేందుకు పాస్‌లు ఇవ్వాలని స్థానిక లీడర్లు మొదటగా ఆఫీసర్లను కోరగా వారు నిరాకరించారు. పాస్‌లు ఇప్పించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరగా 33 మంది బీజేపీ లీడర్లను కొండపైకి అనుమతించారు. నందకుమార్ యాదవ్, కాసం వెంకటేశ్వర్లు, నర్ల నర్సింగరావు, మల్లేశం, శ్రీనివాస్, వనజ, మహేందర్, నరేందర్ ఉన్నారు.
ఆరోగ్యంపై పేదలకు అవగాహన కల్పించాలి
నల్గొండ అర్బన్, వెలుగు : గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆర్‌ఎంపీల పాత్ర కీలకమని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నుంచి అద్దంకి బైపాస్ రోడ్డు వరకు నిర్మించిన సీసీ రోడ్డును శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ అనిమళ్ల కొండల్‌రావు, గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, నాగం వర్షిత్‌రెడ్డి, డీఎన్.చారి పాల్గొన్నారు. అనంతరం ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్‌కు హాజరై పోటీల్లో గెలిచిన వారికి ప్రైజ్‌లు అందజేశారు.
స్టూడెంట్‌కు ఆర్థికసాయం
తుంగతుర్తి, వెలుగు : ఆర్థిక ఇబ్బందులతో ఇంజినీరింగ్‌లో చేరలేకపోతున్న స్టూడెంట్‌కు స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆర్థికసాయం అందించారు. సూర్యాపేట జిల్లా వెలుగుపల్లికి చెందిన మల్లెపాక రాములు కూతురు శ్వేతకు హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీటు లభించింది. అయితే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాములు కాలేజ్ ఫీజు కట్టలేకపోయాడు. విషయం తెలుసుకున్న రాజీవ్ సాగర్ శుక్రవారం శ్వేతకు రూ. 25 వేల ఆర్థికసాయం అందించడంతో పాటు, ఇంజినీరింగ్ పూర్తయ్యే వరకు హాస్టల్ ఫీజు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు. పీఆర్‌టీయూ యాదాద్రి జిల్లా జనరల్ సెక్రటరీ ధర్మారపు వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు రాములు, కమలాకర్, విద్యా కమిటీ మాజీ చైర్మన్ యాదగిరి పాల్గొన్నారు.
దళితుల సంక్షేమానికి కృషి
దేవరకొండ, వెలుగు : దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఇద్దంపల్లిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, జడ్పీటీసీ అరుణ సురేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి, టీవీఎన్‌రెడ్డి పాల్గొన్నారు.