
- నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్దరణ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 1న మొదలైన బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు వైభవంగా జరిగాయి. మంగళవారం ప్రధానాలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాలను ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
108 కలశాల్లో ఉన్న మంత్రజలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించారు. రాత్రి 9 గంటలకు స్వామివారికి శృంగార డోలోత్సవాన్ని జరిపారు. ఉయ్యాలలో శయనించిన లక్ష్మీసమేత నారసింహుడిని భక్తులు దర్శించుకున్నారు. కలెక్టర్ హనుమంతరావు, టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు, రమేశ్ బాబు, నవీన్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దు చేసిన ఆర్జిత సేవలు బుధవారం నుంచి పునరుద్దరించనున్నారు.