యాదగిరిగుట్ట నారసింహుడికి వెండి కలశాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హైదరాబాద్ కు చెందిన హరికృష్ణ స్వప్న దంపతులు రూ.2 లక్షలతో  చేయించిన ఐదు వెండి కలశాలను విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఆలయ సూపరింటెండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డికి అందజేశారు. ఆలయంలో  ఉత్సవాల్లో నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంలో ఈ కలశాలను వినియోగిస్తామని ఆలయ ఆఫీసర్లు తెలిపారు. అనంతరం దాతలు తమ ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

ALSO READ : తుదిశ్వాస వరకు ప్రజాసేవ చేస్తా : కంచర్ల భూపాల్ రెడ్డి

ఆండాళ్ అమ్మవారికి కుంకుమార్చన

శ్రావణ శుక్రవారం సందర్భంగా నరసింహస్వామి దేవస్థానంలో కుంకుమార్చనను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ఈశాన్యంలో ఉన్న వెలుపలి ప్రాకార మండపంలో మహాలక్ష్మీ ఆండాళ్ అమ్మవారిని అధిష్టింపజేసి కుంకుమార్చన జరిపారు. ఆలయ ఈవో గీతారెడ్డి భక్తులతో కలిసి పూజలో పాల్గొన్నారు.