యాదాద్రి గుడిని రాజకీయాలకతీతంగా అభివృద్ది చేయాలి

యాదాద్రి గుడిని రాజకీయాలకతీతంగా అభివృద్ది చేయాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకన్నారు.   ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం మారిన తరువాత యాదగిరిట్ట దేవాలయాన్ని అభివృద్ది చేయలేదన్నారు.   రాజకీయాలకతీతంగా యాదాద్రి అభివృద్ధి జరగాలని డిమాండ్ చేశారు.  కేసీఆర్ హయాంలో యాదగిట్ట పుణ్యక్షేత్రాన్ని రూ. 1200 కోట్లు ఖర్చు పెట్టి అభవృద్ది చేశారన్నారు.  యాదాద్రి ఆలయం  తెలంగాణ ప్రజలకు కొంగుబంగారంగా గిరి ప్రదక్షిణం విరాజిల్లుతుందన్నారు.  

 యాదాద్రి  లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం తో కెసిఆర్  ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు.  యాదగిరిగుట్ట లో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ చేయడం సంతోషంగా ఉందంటూ.. మళ్లీ చేసేందుకు భగవంతుడు శక్తినివ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించేలా..  లక్ష్మీనరసింహస్వామి వారు దీవెనలు ఇవ్వాలని కోరుకున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.