యాదాద్రి నర్సన్న హుండీ లెక్కింపు షురూ.. ఆగస్టులో ఎంతొచ్చిందో తెలుసా..?

యాదాద్రి నర్సన్న హుండీ లెక్కింపు షురూ.. ఆగస్టులో ఎంతొచ్చిందో తెలుసా..?

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు ప్రారంభమైంది. ఆలయ ఈవో భాస్కర్ రావు సమక్షంలో హుండీ లెక్కింపు జరుగుతోంది. ఆగస్ట్ నెలలో కూడా హుండీ లెక్కింపు జరిగింది. ఆగస్టులో.. నెల రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండిని కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్కు తరలించి కౌంట్ చేశారు. రూ.2,66,68,787 కోట్ల నగదు రాగా.. 87 గ్రాముల బంగారం, 3 కిలోల 300 గ్రాముల వెండి సమకూరిందని ఈవో భాస్కర్ రావు చెప్పిన సంగతి తెలిసిందే.

1,355 అమెరికన్​డాలర్లతో పాటు కెనడా, యూఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, కువైట్, నేపాల్​, ఖతార్ , థాయ్​లాండ్​, ఒమన్ , శ్రీలంక , న్యూజిలాండ్ , కెన్యా , ఈజిప్టు, ఇతర దేశాల కరెన్సీ వచ్చిందని ఆ సందర్భంగా ఈవో చెప్పారు. మే నెలలో వేసవి సెలవులు కావడంతో ఆ నెలలో స్వామి వారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో ఉంది. గత మే నెలలో కానుకల రూపంలో యాదాద్రి నర్సన్నకు  రూ.3,93,88,092 కోట్ల నగదు రావడం విశేషం.