యాదాద్రి హుండీ ఆదాయం రూ. కోటి 78 లక్షలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలో 16 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహించారు. కానుకల్లో రూ.1,78,52,446 నగదు రాగా, 86 గ్రాముల బంగారం, 3 కిలోల 500 గ్రాముల వెండి సమకూరినట్లు ఈవో చెప్పారు. హుండీలలో విదేశీ కరెన్సీని భక్తులు అధిక మొత్తంలో సమర్పించారు.

అమెరికా 664 డాలర్లు, యూఏఈ 5 దిర్హామ్స్, ఆస్ట్రేలియా 10 డాలర్లు, కెనడా 70 డాలర్లు, ఓమన్ 600 బైసా, ఖతార్ 1, యూరోప్ 25, బూటాన్ 1, సౌతాఫ్రికా 100, బంగ్లాదేశ్ 10, జపాన్ 1000, నేపాల్ 10 రూపాయలు, సిరియా 500 కరెన్సీ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.