యాదగిరిగుట్టకు ఏప్రిల్‌‌‌‌లో రూ. 15 కోట్ల 64 లక్షల ఇన్‌‌‌‌కం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఏప్రిల్‌‌‌‌లో భారీ ఆదాయం సమకూరింది. వివిధ విభాగాల ద్వారా మొత్తం రూ.15,64,05,949 ఆదాయం వచ్చినట్లు ఈవో భాస్కర్‌‌‌‌రావు శనివారం వెల్లడించారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ.3,05,08,630 రాగా, హుండీల ద్వారా రూ.2,33,53,382, ఆర్జిత సేవల ద్వారా రూ.1,34,56,805, వీఐపీ టికెట్ల ద్వారా రూ.96,50,650, బ్రేక్‌‌‌‌ దర్శనాలతో రూ.69,10,200, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.43,37,300, విచారణ శాఖ ద్వారా రూ.24,37,718, ఇతర విభాగాల నుంచి రూ.5,58,51,264 ఇన్‌‌‌‌కం వచ్చినట్లు ఈవో ప్రకటించారు.