యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. 48 రోజుల పాటు హుండీల ద్వారా వచ్చిన నగదు, బంగారం, వెండిని కొండ కింద గల సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేకహాల్‌లో ఈవో భాస్కర్‌రావు పర్యవేక్షణలో కౌంట్ చేశారు. మొత్తం రూ.4,17,13,596లతో పాటు 288 గ్రాముల బంగారం, 7 కిలోల 50 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో భాస్కర్‌రావు చెప్పారు.
అలాగే 1,721 అమెరికా డాలర్లు, 40 ఇంగ్లాండ్ పౌండ్లు, 490 యూఏఈ దిర్హామ్స్, 15 యూరోప్ యూరోలు, 110 నేపాల్ రూపీస్, 15 కెనడా డాలర్లు, 39 సౌదీ అరేబియా రియాల్స్, 62 సింగపూర్ డాలర్లు, 195 ఆస్ట్రేలియా డాలర్లు, 12 ఖతార్ రియాల్స్, 20 థాయ్‌లాండ్ భాట్, 702 ఒమన్ బైసా, 270 శ్రీలంక రూపీస్, 15 కెనడా డాలర్స్, 122 మలేషియా రింగిట్స్, 1000 కొరియా వన్, 170 బంగ్లాదేశ్ టక్కా, 1000 ఫిలిప్పీన్స్ పెసో, 25 జార్జియా, 1000 ఇండోనేషియా, 100 హాంకాంగ్ కరెన్సీ వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.