యాదగిరిగుట్టలో కేశఖండన టికెట్ ధర పెంపు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కేశఖండన టికెట్ ధర పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తుల్లో చాలామంది కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. తలనీలాలు సమర్పించుకోవడం కోసం ప్రత్యేకంగా టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టికెట్​ధర రూ.20 ఉండగా దీనిని రూ. 50 చేశారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అందుబాటులోకి వస్తాయని ఈవో గీతారెడ్డి చెప్పారు. టికెట్టు ధరలో 60 శాతం నాయీ బ్రాహ్మణులకు రెమ్యూనరేషన్ కింద చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.