యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి రూ.2.38 కోట్ల ఆదాయం వచ్చింది. గత 28 రోజులుగా భక్తులు హుండీల్లో వేసిన నగదు, బంగారం, వెండిని గురువారం లెక్కించారు. ఎస్పీఎఫ్, హోంగార్డుల భద్రత నడుమ హుండీలను కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్‌కు తరలించి ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహించారు. రూ.2,38,46,282 నగదు రాగా.. 90 గ్రాముల బంగారం, 3 కిలోల 740 గ్రాముల వెండి వచ్చింది.
748 అమెరికా డాలర్లు, 670 యూఏఈ దిర్హామ్స్, 40 ఆస్ట్రేలియా డాలర్లు, 150 కెనడా డాలర్లు, 80సింగపూర్ , 100 ఇంగ్లాండ్ , 21 సౌదీ అరేబియా , 200శ్రీలంక , 25యూరోప్ , 50 కెన్యా , 200 ఒమన్ , 1012 మలేషియా, 10 నేపాల్ , 1 ఖతార్ , 2 ఉక్రెయిన్ , 240 థాయిలాండ్ కరెన్సీ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.