![నారసింహుడికి ‘చక్రస్నానం’.. వైభవంగా జరుగుతున్న పాతగుట్ట బ్రహ్మోత్సవాలు](https://static.v6velugu.com/uploads/2025/02/yadagirigutta-patha-gutta-celebrations-with-chakrasnanam-to-narasimha-swami_zSFcjMPW9L.jpg)
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ఆలయంలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించారు.
అనంతరం ప్రత్యేక అలంకారంలో స్వామిఅమ్మవార్లను ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితుల వేదపారాయణాలు, యజ్ఞాచార్యుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామిఅమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టాన్ని కనులపండువగా జరిపారు.