యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అధ్యయనోత్సవాలు చివరి రోజు కావడంతో నారసింహుడు.. భక్తులకు నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. రేపటి నుండి యధావిధిగా సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
నిన్న స్వామివారు ఉదయం వటపత్రశాయి అవతారంలో..సాయంత్రం వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చారు. అలంకార సేవ అనంతరం స్వామివారిని మాఢవీధుల్లో ఊరేగించారు.