యాదగిరిగుట్టలో భక్తులు కిటకిట

యాదగిరిగుట్టలో భక్తులు కిటకిట
  •     ధర్మదర్శనానికి 2 రెండు గంటలు, స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శనానికి అరగంట

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులు కిటకిటలాడింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపైన, కిందా ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు, కొండపైన బస్ బే, దర్శన, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారాయి. భక్తుల రద్దీ కారణంగా నారసింహుడి ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం పట్టింది.

స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, లక్షపుష్పార్చన పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.యాదగిరిగుట్ట ఆలయానికి ఆదివారం రూ.45,08,650 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు. ఆదాయంలో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.17,71,940, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.7 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. 

నారసింహుడి సేవలో పలువురు ప్రముఖులు 

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రియదర్శిని వేర్వేరు సమయాల్లో స్వామివారిని దర్శించుకుని గర్భగుడిలో స్వయంభు నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో అష్టోత్తర పూజలు జరిపించారు. ఆలయానికి దర్శనం అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.