- ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం
- ఆలయానికి రూ.64.43 లక్షల ఇన్ కమ్
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సండే హాలీడే కావడంతో.. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీతో స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు
జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.64,43,032 ఆదాయం వచ్చింది.
అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.27.01 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.7.50 లక్షలు, వీఐపీ దర్శన టికెట్లతో రూ.13.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.4.44 లక్షలు, ప్రధాన బుకింగ్తో రూ.2,35,450, కల్యాణకట్ట ద్వారా రూ.1.40 లక్షలు, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.1,34,300, యాదరుషి నిలయం ద్వారా రూ.2,75,094, సువర్ణపుష్పార్చన పూజల తో రూ.1,20,200 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.