యాదగిరిగుట్ట నరసన్న సేవలో ఎమ్మెల్సీ సురభి వాణి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. గర్భగుడిలో నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తొలుత ఆలయానికి వచ్చిన ఆమెకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. ఆలయానికి బుధవారం రూ.18,82,227 ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.