యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పులిహోర, లడ్డూ విభాగంలో ఈరోజు(2024 మార్చి 24) ఆలయ ఈవో భాస్కరరావు తనిఖీలు చేపట్టారు. పులిహోర తయారు చేసే విధానాన్ని, లడ్డు సప్లై చేసే వాటి గురించి ఆలయ ఈవో అడిగి తెలుసుకున్నారు.
గతంలో భక్తులకు ఇచ్చే పులిహోరలో ఎలుక వచ్చిందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదాలు, పులిహోర తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రసాదాల తయారీ ఎలా ఉంది, పులిహోరలో ఎలుకలు పడడానికి అవకాశం ఉందా ? అనే వివరాలను తెలుసుకున్నారు. నాణ్యత లోపాలు ఉంటే సహించేదే లేదని హెచ్చరికలు జారీ చేశారు.