వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో యాదగిరిగుట్ట టెంపుల్​

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి లండన్ కు చెందిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. యాదగిరిగుట్టపై  నాలుగేండ్ల కాలంలోనే  4.3 ఎకరాల విస్తీర్ణంలో  2.3 మెట్రిక్ లక్షల టన్నుల  కృష్ణశిలతో ఏడంతస్తుల రాజగోపురంతో పాటు సప్తగోపురాలు,  నాలుగు ప్రాకారాలతో కలిసి స్వామివారి ప్రధానాలయాన్ని అద్భుతంగా నిర్మించినందుకు ఈ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం యాదగిరిగుట్టలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డికి ఆ సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్​అందించారు.  కార్యక్రమంలో మంత్రులు జగదీశ్​ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.