కిటకిటలాడిన నర్సన్న, రాజన్న ఆలయాలు

కిటకిటలాడిన నర్సన్న, రాజన్న ఆలయాలు

 

  • యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట టైం
  • ఆదివారం ఒక్కరోజే రూ.51.40 లక్షల ఆదాయం

 యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కొండ కింద లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు, కల్యాణకట్ట, అన్నదాన సత్రం, పార్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రదేసం, కొండపైన బస్‌‌‌‌‌‌‌‌ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట టైం పట్టింది. 

నారసింహుడి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు ఆదివారం జరిపించిన వివిధ రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.51,40,252 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.20,62,120, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.50 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.9.75 లక్షలు, బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శనాలతో రూ.4,70,100 ఇన్‌‌‌‌‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు : సెలవురోజు కావడంతో రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో వేములవాడకు తరలివచ్చారు. భక్తులు ముందుగా స్వామివారి కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. సాధారణ క్యూలైన్‌‌‌‌‌‌‌‌, శీఘ్ర దర్శనం, కోడెల క్యూలెన్లు, ప్రసాదం కౌంటర్‌‌‌‌‌‌‌‌ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.