యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట ఆలయ హుండీలను చెత్తకుప్పలో పడేశారు ఆలయ సిబ్బంది. ఆలయంలో దేవుడితో పాటు హుండీలను కూడా భక్తి భావంతో కొలుస్తారు భక్తులు. అయితే హుండీలను చెత్త కుప్పలో పడేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ ఉద్ఘాటన జరిగాక శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కూడా తిరుమలలో ఉన్నట్లు బట్ట హుండీలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటి వరకు ఆలయంలో ఉన్న ఐరన్ హుండీలను భద్ర పరచకుండా చెత్త కుప్పల్లో పడేశారు. దీంతో ఇలా చేయడం సరికాదంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.