యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.1.77 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తులు 22 రోజులుగా హుండీల్లో వేసిన నగదు, బంగారం, వెండిని మంగళవారం ఈవో రామకృష్ణారావు, చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు.
హుండీల్లో రూ.1,77,99,734 నగదుతో 99 గ్రాముల బంగారం, 4 కిలోల 170 గ్రాముల వెండిని భక్తులు సమర్పించారు. 397 అమెరికా డాలర్లు, 65 యూఏఈ దిర్హామ్స్, 70 ఆస్ట్రేలియా డాలర్లు, 20 కువైట్ దినార్, 5ఇంగ్లాండ్ పౌండ్లు, 20 యూఏఈ దిర్హామ్స్, 15 యూరోప్ యూరోలు, 1 మలేషియా రింగిట్స్, 5ఖతార్ రియాల్స్, 50 న్యూజిలాండ్ డాలర్లు, 10నేపాల్ రుపీస్ వచ్చినట్లు ఆలయ ఈవో రామకృష్ణరావు తెలిపారు.