యాదగిరీశుడి అఖండజ్యోతి యాత్ర ప్రారంభం

  •  ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి
  •   21న యాదగిరిగుట్టకు చేరుకోనున్న యాత్ర

యాదగిరిగుట్ట, వెలుగు : ఈ నెల 21 నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నారసింహుడి ‘అఖండ జ్యోతియాత్ర’ శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్కత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురలోని యాదగిరిభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రారంభ మైంది. కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రత్యేక పూజలు చే సి జ్యోతియాత్రను ప్రారంభించారు. శనివారం ప్రారం భమైన ఈ యాత్ర నారాయణగూడ, విద్యానగర్, రామంతాపూర్, హబ్సిగూడ, ఉప్పల్, నారపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయగిరి మీదుగా ఈ నెల 21న రాత్రి 7 గంటల వరకు యాదగిరిగుట్టకు చేరుకుంటుందని యాత్ర చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సద్ది వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు.

గుట్టకు చేరుకున్నాక వైకుంఠద్వారం వద్ద లక్ష్మీనరసింహుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వ హించిన అనంతరం రాత్రి 10 గంటలకు రాయగిరి చెరువులో స్వామిఅమ్మవార్ల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాదగిరిగుట్ట ఆలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరసింహమూర్తి, ఏఈవో శ్రావణ్‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అఖండజ్యోతి యాత్ర అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, యాత్ర ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీకొండ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెలిదె అశోక్, కైరంకొండ సుధీర్, పబ్బాల రాములు పాల్గొన్నారు.