సూర్యాపేట: సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే యాదవులకు సామాజికంగా, రాజకీయంగా సరైన గుర్తింపు, గౌరవం లభించాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాకముందు గొల్ల కురుమలను ఎవరు పట్టించుకోలేదని వివరించారు. సూర్యాపేటలో యాదవులు నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి అధికారికంగా సదర్ సమ్మేళనాలు నిర్వహిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.
సూర్యాపేటలో రూ.2 కోట్లతో యాదవ భవనం నిర్మిస్తామని, త్వరలోనే దానికి శంకుస్థాపన చేస్తామని జగదీష్ రెడ్డి ప్రకటించారు. గొర్రెలకు సంబంధించి డైరెక్టుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయడం జరుగుతుందని.. దళారుల బెడద లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా దున్న రాజులతో యాదవులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.