వృద్ధ దంపతులపై దాడి ఘటనలో యాదయ్య పరిస్థితి సీరియస్

వృద్ధ దంపతులపై దాడి ఘటనలో యాదయ్య పరిస్థితి సీరియస్
  • వృద్ధ దంపతులపై దాడి ఘటనలో యాదయ్య పరిస్థితి సీరియస్
  • నిమ్స్​కు తరలించి ట్రీట్​మెంట్​
  • ఎంపీటీసీ భర్త, మరిదిపై హత్యాయత్నం కేసు.. రిమాండ్​

చేవెళ్ల, వెలుగు: వికారాబాద్ జిల్లా నవాబ్​పేట మండలం పులుమామిడి గ్రామంలో వృద్ధ దంపతులపై దాడి ఘటనలో గాయపడిన తెలుగు యాదయ్య పరిస్థితి సీరియస్​గా ఉంది. ప్రస్తుతం నిమ్స్​లో చికిత్స పొందుతున్నాడు. భరతమ్మ వికారాబాద్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నది. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్​ వైరల్​ కావడంతో.. వృద్ధ దంపతుల కోడలు తెలుగు గాయత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి వివరాలు మీడియాకు వివరించారు.

టీఆర్​ఎస్​ ఎంపీటీసీ తేజస్వీ భర్త సోమనోళ్ల రామక్రిష్ణా రెడ్డి, అతని సోదరుడు సోమనోళ్ల శ్రీనివాస్​రెడ్డిపై హత్యాయత్నం కింద కేసు ఫైల్ చేసి రిమాండ్​కు తరలించామన్నారు. కాగా, పోలీసుల వైఖరిపై ముదిరాజ్​ సంఘం వికారాబాద్​ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​ మండిపడ్డారు. ఎంపీటీసీ తేజస్విపైనా కేసు పెట్టాలని డిమాండ్​ చేశారు.  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని,  సోమవారం నలుగురిపై కేసు ఫైల్ చేశామన్న పోలీసులు.. ఇపుడు ఇద్దరిపై కేసు నమోదు చేశామని చెప్పుడేందని విమర్శించారు. నలుగురిపై కేసు పెట్టి.. పీడీ యాక్ట్​ పెట్టాలన్నారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ఎస్​ఐను సస్పెండ్​ చేయాలని కోరారు.