దోహా: పాలస్తీనా మిలిటెంట్స్ గ్రూప్ హమాస్ చీఫ్ గా యహ్యా సిన్వార్ నియమితులయ్యరు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మరణించిన తర్వాత నిన్న హమాస్ కొత్త చీఫ్ ను ప్రకటించింది. సిన్వార్ కు అక్టోబర్ 7 డాడుల రూపశిల్పిగా పేరుంది. అల్లర్లు మొదలైనప్పటి నుంచి సన్వార్ గాజాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనను చంపేందుకు ఇజ్రాయెల్ అనేక ప్రయత్నాలు చేసినా తప్పించుకున్నాడు.
స్లామిక్ రెసిస్టెన్స్ మూవ్ మెంట్ హమాస్ కమాండర్ యాహ్యాను ఉద్యమ పొలిటికల్ బ్యూరో చీఫ్ గా ఎంపిక చేసినట్లు హమాస్ సంస్థ ప్రకటించింది. అమరుడు ఇస్మాయిల్ హనియే, అల్లా తనిపై దయచూపాలని పేర్కొంటూ హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ALSO READ | Muhammad Yunus: బంగ్లాదేశ్ పరిస్థితిని మహ్మద్ యూనస్ మార్చగలరా..? అసలింతకీ ఎవరీయన..?
హ్యా సిన్వార్ దక్షిణ గాజా లోని ఖాన్ యూనిస్ లోని ఓ శరణార్థి శిబిరంలో జన్మించాడు. అక్టోబర్ 7 నాడు దక్షిణ ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి పాల్పడింది. 1200 మందిని చంపేయడమే కాకుండా, 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా యహ్యా సిన్వార్ అని ఇజ్రాయిల్ ప్రకటించింది.
ప్పటి నుంచి అతడి జాడ కోసం వెతుకుతూనే ఉంది. ఈ తరుణంలో యాహ్యా సిన్వార్ ను హమాస్ చీఫ్ గా ప్రకటించడం విశేషం. క్లిష్టమైన సమయంలో చీఫ్ బాధ్యతలు స్వీకరించిన యహ్యా ఎలాంటి వ్యూహానికి తెరలేపుతాడనేది హాట్ టాపిక్ గా మారింది.