రైలు కిందపడి జంట ఆత్మహత్య

హైదరాబాద్ పాతబస్తీ యాకుత్ పురాలో దారుణం జరిగింది. రైలు కిందపడి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దంపతుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతి చెందిన జంటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.