ఇవాళ 65వ శ్రీకృష్ణ జయంత్యుత్సవం.. రాష్ట్ర యాదవ మహాసభ ఆధ్వర్యంలో వేడుకలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యాదవ మహాసభ ఆధ్వర్యంలో సోమవారం 65వ శ్రీకృష్ణ జయంత్యుత్సవం నిర్వహించనున్నట్టు మహాసభ అధ్యక్షుడు యల్లావుల చక్రధర్‌‌‌‌ యాదవ్‌‌‌‌ వెల్లడించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యాదవ ప్రముఖులంతా హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ వేడులకకు సంబంధించిన బ్రోచర్‌‌‌‌ను చక్రధర్, యాదవ సంఘాల ప్రతి నిధులతో కలిసి ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా చక్రధర్‌‌‌‌ యాదవ్‌‌‌‌ మాట్లాడారు. ఈ నెల 26న సికింద్రాబాద్‌‌‌‌ హరిహర కళాభవన్‌‌‌‌లో సాయంత్రం 7 గంటలకు ఈ కార్యక్రమం జరగనుందని చెప్పారు. యాదవులంతా ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తరలి వచ్చి విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగెల్లి అంజన్ యాదవ్, జంగిటీ ప్రవీణ్ యాదవ్, ఎంబీ కృష్ణ యాదవ్, మొడికే శ్రీనివాసులు, కీర్తి సుధాకర్‌‌‌‌రావు యాదవ్, రాంప్రసాద్ యాదవ్, ఉడుత పరమేశ్వర్ యాదవ్, బొట్టు మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.