Yamaha:యమహా ఫస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ బైక్ వచ్చేసిందోచ్..ధర, ఫీచర్లు అదుర్స్..

Yamaha:యమహా ఫస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ బైక్ వచ్చేసిందోచ్..ధర, ఫీచర్లు అదుర్స్..

యమహా ఇండియా మోటార్  ఫస్ట్ హైబ్రిడ్ మోటార్ బైక్  ను విడుదల చేసింది. యమహా FZSFi హైబ్రిడ్ 2025 ఎడిషన్ను ఇండియాలో ప్రారంభించింది. ఈ బైక్ లో హైబ్రిడ్ టెక్నాలజీని అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ బైక్ శక్తివంతమైన బ్లూకోర్ ఇంజిన్, స్మార్ట్ మోటార్ జనరేటర్ , స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ తో వస్తుంది.4.2 అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్ప్లేతో  గూగుల్ మ్యాప్ లింకింగ్, నావిగేషన్ ఇండెక్స్, ప్రదేశాల పేర్లు వంటి ఫీచర్లతో రైడింగ్ ను మరింత సులభతరం చేస్తుంది. లాంగ్ డ్రైవింగ్ కు సహకరించేలా పొజిషన్ ఆప్టిమైజ్ చేసిన హ్యాండిల్ బార్, చేతికి గ్లౌజులు వేసుకున్నా ఉపయోగించేందుకు సౌకర్యంగా స్విచ్ లు డిజైన్ చేశారు. 

యమహా మోటార్ కంపెనీ హైబ్రిడ్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ , పెట్రోల్ ఇంజన్ల మెక్సింగ్ ప్రత్యేకతను కలిగిఉంది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ బైక్ పెట్రోల్ వినియోగంలో మెరుగైన సామర్థ్యం, పర్యావరణానికి హాని కలిగించకుండా ఉంటుంది. శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యం తగ్గిస్తుంది. పట్టణాలలో ఉండేవారికి ఇది బెస్ట్. 

యమహా FZSFi హైబ్రిడ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.45లక్షలు. ఈ కొత్త 2025 FZ-S-Fi హైబ్రిడ్ వేరియంట్ రేసింగ్ బ్లూ,సియాన్ మెటాలిక్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు.. 

  • ఈ బైక్ లో కు 149cc బ్లూ కోర్ ఇంజిన్ 
  • OBD-2B కి అనుగుణంగా యమహా స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) 
  • స్టాప్ & స్టార్ట్ సిస్టమ్ (SSS) 
  • ఈ టెక్నాలజీలో సౌండ్ తక్కువ, ఆగివున్నప్పుడు దానంతటదే ఇంజిన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. క్లచ్ పడితే వెంటనే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. 
  • కొత్త FZ-S Fi హైబ్రిడ్ బైక్ లో 4.2-అంగుళాల పూర్తి-రంగు TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ డిస్ ప్లే ఉంటుంది. 
  • Y -కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లతో కనెక్షన్ 
  • Google Mapsకి లింక్ 
  • టర్న్-బై-టర్న్ (TBT) నావిగేషన్‌ను 
  • రియల్-టైమ్ దిశలు, నావిగేషన్ ఇండెక్స్, లోకేషన్ పేరు అందిస్తుంది 
  • లాంగ్ రైడ్స్‌లో సౌకర్యవంతంమైన పొజిషన్‌ను ఆప్టిమైజ్ చేసిన హ్యాండిల్‌బార్ 
  • హ్యాండిల్‌బార్‌లోని స్విచ్‌లు మెరుగైన యాక్సెసిబిలిటీ (చేతికి గ్లౌజులు వేసుకున్నా)

యమహా మోటార్ కంపెనీ ఇటీవల కొత్త హైబ్రిడ్ బైక్‌ను ప్రవేశపెట్టింది.ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్,పెట్రోల్ ఇంజిన్‌ల మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా ప్రత్యేకతను సాధించింది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ బైక్ మెరుగైన ఇంధన సామర్థ్యం, ఎకో సిస్టమ్ కలిగి ఉంటుంది. తక్కువ పెట్రోల్ వినియోగం, శబ్ద ,వాయి కాలుష్యం కూడా తగ్గిస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని వారికి మంచి ఎంపిక. యమహా ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసి  భవిష్యత్తులో మరిన్ని హైబ్రిడ్ ,ఎలక్ట్రిక్ వెహికల్స్ అందించేందుకు ప్లాన్ చేస్తుంది.