న్యూఢిల్లీ:యమహా ఐకానిక్ మోడల్ ఆర్‌ఎక్స్100 మళ్లీ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్‌ను తిరిగి లాంచ్ చేయాలని కంపెనీ చూస్తోందని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ, పెద్ద ఇంజిన్‌తో ఇవి అందుబాటులోకి వస్తాయని అంచనా. రిపోర్ట్స్ ప్రకారం, ఈ కొత్త బండి పేరు ఆర్ఎక్స్తో స్టార్టవుతుంది. కానీ, ఆ తర్వాత 100 నెంబర్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ బండ్లలో 225.9 సీసీ ఇంజిన్ అమర్చనున్నారు.
ఈ బైక్ 20.1 బీహెచ్‌పీ పవర్, 19.93 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను రిలీజ్ చేయగలదు. ఆర్‌ఎక్స్100 డిజైన్‌లో కొంత కొనసాగించనున్నారు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ కొత్త ఆర్‌ఎక్స్ బైక్ ధర రూ. 1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉండనుంది. కానీ, యమహా మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించలేదు.
ఆర్‌ఎక్స్ 100 సక్సెసర్ మోడల్స్ వస్తున్నాయని రిపోర్ట్స్ రావడం ఇదేమి మొదటి సారి కాదు. 2022 లో కూడా ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి. 1980 –90 ల్లో బాగా పాపులర్ అయిన ఆర్‌ఎక్స్ 100 బైక్‌కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు.