
గురుగ్రామ్: ఐటీఎఫ్ విమెన్స్ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి యమలాపల్లి సహజ.. క్వార్టర్‌ఫైనల్‌తోనే సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో ఐదోసీడ్ సహజ 5–7, 6–3, 0–6తో డాలిలా జాకుపోవిక్ (స్లోవేకియా) చేతిలో ఓడింది. ఆరంభంలో తడబడిన సహజ రెండో సెట్‌లో దీటుగా ఆడింది. కానీ కీలకమైన మూడో సెట్‌లో ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. డాలిలా కొట్టిన బలమైన సర్వీస్‌ల ముందు తెలుగమ్మాయి తేలిపోయింది.