Yami Gautam: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి యామీ గౌతమ్..కుమారుడికి వేద్ విద్ అంటూ నామకరణం..అర్ధమేంటో తెలుసా?

టాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలతో మంచి గుర్తింపు పొందిన నటి యామీ గౌతమ్(Yami Gautam).2021 జూన్ 4న హిమాచల్ ప్రదేశ్‌లో యామి గౌతమ్  దర్శకుడు ఆదిత్య ధర్ ను  ప్రేమించి పెళ్లాడింది. తాజాగా ఈ అమ్మడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ జంట సోషల్ మీడియా ద్వారా శ్రీ కృష్ణుడిని ఫోటోని షేర్ చేస్తూ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు నేడు (మే 20న) వెల్లడించారు. 'మే 10న అక్షయ తృతీయ'నాడు తమ కుమారుడు జన్మించాడని, అతనికి 'వేదవిద్' అని పేరు పెట్టినట్లు వెల్లడిస్తూ ఒక స్పెషల్ నోట్ రాశారు.

వేదవిద్ అంటే ఏమిటి?

వేదవిద్ అంటే 'వేదాలు తెలిసినవాడు' అని అర్థం. ఇది విష్ణువు, శివుడు మరియు రాముడికి కూడా పేరు ఉంటుందని సమాచారం. వేదం అనేది సంస్కృత పదం, దీని అర్థం హిందూ మతంలో జ్ఞానం లేదా పవిత్ర గ్రంథం, విద్ అంటే ఏదో జ్ఞానం ఉన్నవాడు అని అంటారు. కాగా ఈ వార్త తెలుసుకున్న బాలీవుడ్ సెలెబ్రేటీలు తమ విషెష్ అందిస్తున్నారు. 

యామీ నటించిన 'కాబిల్' మూవీలో హీరోగా నటించిన హృతిక్ రోషన్ ట్వీట్ చేస్తూ.."అభినందనలు గాడ్ బ్లెస్ !' అని అన్నారు, ఇక త్వరలో తండ్రి కాబోయే రణవీర్ సింగ్.."బహుత్ బహుత్ బహుత్ సారా ప్యార్! ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు." అలాగే ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ.."హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. ఇక మృణాల్ ఠాకూర్,నేహా ధూపియా తదితరులు కూడా లవ్ ఎమోజీలతో అభినందనలు కురిపించారు!రీసెంట్ గా యామి గౌతమ్ ఆర్టికల్ 370, ఓ మై గాడ్ 2, మైన్ హున్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది.