
కాశ్మీర్ హింస, తీవ్రవాదంపై అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆర్టికల్ 370(Article 370). ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకుంది.ఇందులో పవర్‌ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా యామి గౌతమ్ (Yami Gautam) నటన అందరినీ ఆకట్టుకుంది. ఇండియాలో మాత్రమే కాదు..ఓవర్సీస్‌లో కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్-ప్యాక్డ్ పొలిటికల్ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.
తాజాగా ఈ సినిమా రేపటి (ఏప్రిల్ 19) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఆర్టికల్ 370 మూవీకి మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక రిలీజ్ అయ్యాక కూడా కొన్ని దేశాల్లో నిషేధం కూడా వ్యక్తం అయింది. అయిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. రిలీజైన ఫస్ట్ రోజే రూ.5.75 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి OTT ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది చూడాలి.
కథ విషయానికి వస్తే..
జమ్ము కశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ని భారత ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసింది. దీంతో జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక స్టేటస్‍ను ఎత్తేస్తూ..భారత ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కూడా అక్కడ చాలా విధాలుగా నిరసనలు జరిగాయి. అయితే, కొన్నాళ్లకు శాంతి భద్రతలను..కొంతమేరకు స్వేచ్ఛను ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. ఈ అంశంపైనే ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.