టీడీపీకి షాక్: యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్‌ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల కృష్ణుడు టీడీపీకి రాజనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, గత కొంత కాలంగా యనమల సోదరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.గత నలభై ఏళ్లుగా అన్న యనమల రామకృష్ణుడికి నమ్మకంగా ఉన్న తమ్ముడు యనమల కృష్ణుడు పార్టీకి రాజీనామా చేయటం రామకృష్ణుడికి గట్టి షాక్ అనే చెప్పాలి. తునిలో రామకృష్ణుడు ఆరుసార్లు గెలవడానికి కీలక పాత్ర పోషించాడు యనమల కృష్ణుడు.

Also Read: డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా..

అయితే, 2014, 2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడు ఓడిపోవడంతో సోదరుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. యనమల కృష్ణుడి స్థానంలో తన కుమార్తెకు రామకృష్ణుడు ఎన్నికల బరిలోకి దింపారు. చంద్రబాబుతో సంప్రదింపులు జరిపి తన కుమార్తె దివ్యకు సీటు వచ్చేలా రాజకీయం నడపారు రామకృష్ణుడు. ఈ క్రమంలో యనమవ కృష్ణుడిని ఆయన దూరం పెట్టారు. దీంతో యనమల సోదరుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.

ఈసారి జరిగే ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు యనమల కృష్ణుడు. కుమార్తె దివ్యను గెలిపించుకునేందుకు సన్నాహాలు చేస్తున్న రామకృష్ణుడు తన సోదరుడిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయకపోవటంతో మరింత హర్ట్ అయిన కృష్ణుడు పార్టీకి రాజీనామా చేశారు. ఈయన త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.