తెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తాం : యార్లగడ్డ

తెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తాం : యార్లగడ్డ

ఆంధ్ర ప్రదేశ్: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సెక్రటేరియట్ లో 10శాతం కన్నా ఎక్కువ అధికార భాషను ఉపయోగించడంలేదని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. మంగళవారం తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన నెలకే అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు.  అధికార భాషను క్రింది స్థాయి నుండి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే సోమవారం తిరుపతి లోని కార్పొరేషన్ అధికారులతో సమావేశం అయినట్లు చెప్పారు. అన్ని జిల్లాలను, ప్రాంతాలను పర్యవేక్షించి… రాబోవు రోజుల్లో తెలుగు బాషను అధికారిక భాషగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు యార్లగడ్డ.