
కోనరావుపేట, వెలుగు : సిరిసిల్ల జిల్లాలో యార్న్ డిపో మంజూరు చేయడం పట్ల నేతన్నలు, కాంగ్రెస్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేతన్నలు ఏన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని, యార్న్ డిపో ఏర్పాటు వల్ల కార్మికుల కష్టాలు తీరనున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు బద్దెపూరి రవి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చేపూరి గంగాధర్, జిల్లా కార్యదర్శులు తాళ్లపల్లి ప్రభాకర్, రుక్మిణి, మానుక సత్యం పాల్గొన్నారు.