
- 1,000 టన్నులకు పైగా పెండింగ్ పెట్టిన 10 మిల్లులు
- మొత్తం 40 మిల్లుల్లో కలిపి 35 వేల టన్నులు..
- చెక్కులిచ్చిన నలుగురు మిల్లర్లు
యాదాద్రి, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోలు ప్రారంభమవుతున్న సమయంలో ఆఫీసర్లు మిల్లర్లకు షాక్ఇస్తున్నారు. సీఎంఆర్ పెండింగ్‌లో ఉన్న మిల్లులకు ఈ సీజన్ధాన్యం అప్పగించొద్దని నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో 35 వేల టన్నుల సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది.
మిల్లులకు 4.10 లక్షల టన్నుల వడ్లు..
2022-–23 యాసంగి సీజన్‌కు సంబంధించి సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ జిల్లాలోని 40 మిల్లులకు 4,10,191 టన్నులవడ్లు అప్పగించింది. ఇందుకు 2,77,428 టన్నుల సీఎంఆర్‌ను మిల్లర్లు అప్పగించాలి. కానీ, సరిగా ఇవ్వలేదు. మిల్లుల్లో పెండింగ్ఉన్న 1.86 లక్షల టన్నుల వడ్లకు టెండర్వేశారు. క్వింటాల్‌కు రూ.2 వేల చొప్పున కేంద్రీయ భండార్సంస్థ గతేడాది ఫిబ్రవరిలో దక్కించుకుంది. అయినా, వడ్లను మిల్లర్లు ఆ సంస్థకు అప్పగించలేదు. దీంతో, ఆ ధాన్యాన్ని మరాడించి, 5 శాతం నూకతో ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పటివరకు 720 టన్నుల బియ్యం ఎగుమతి చేశారు.
4.50 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం
2022–-23 సీజన్‌కు సంబంధించి 10 మిల్లులు ఒక్కొక్కటి 1,000 టన్నులకు పైగా సీఎంఆర్బకాయి ఉన్నారు. ఈ లెక్కన మొత్తం 40 మిల్లులు కలిపి, 35 వేల టన్నులు పెండింగ్ఉన్నాయి. కాగా, 2024–-25 యాసంగి సీజన్‌కు సంబంధించి వడ్ల కొనుగోళ్లు ఈ వారంలో ప్రారంభం కానున్నాయి. ఈసారి 4.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమయంలో సీఎంఆర్పెండింగ్ లెక్కలు తీసిన ఆఫీసర్లు.. క్లియర్ చేయాలని మిల్లర్లను ఆదేశించారు. బియ్యం అప్పగించని పక్షంలో వాటికి సమానమైన డబ్బును ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. లేకపోతే ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన వడ్లను ఇవ్వబోమని తేల్చిచెప్పారు.
గడువు కోరిన మిల్లర్లు!
కొందరు మిల్లర్లు తమకు కొంచెం గడువు కావాలని ఆఫీసర్లను కోరినట్లు తెలిసింది. వడ్ల కొనుగోలు సమయానికి అనుకూలంగా తేదీలతో నలుగురు చెక్కులిచ్చారు. అవి చెల్లుబాటై, అకౌంట్ లో డబ్బులు జమ అయితే సీఎంఆర్ ఇస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం. కాగా, సీఎంఆర్పెండింగ్ ఉన్న మిల్లులకు ఈ సీజన్వడ్లు అప్పగించే అవకాశం లేదని ఓ ఆఫీసర్ తెలిపారు.