IND vs BAN 2024: కెరీర్ ముగిసిందనుకున్నారు.. ఏకంగా టీమిండియాలోనే చోటు

IND vs BAN 2024: కెరీర్ ముగిసిందనుకున్నారు.. ఏకంగా టీమిండియాలోనే చోటు

బంగ్లాదేశ్ జరగబోయే రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేశారు. సొంతగడ్డపై భారత్ ఆడనున్న ఈ సిరీస్ కు ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ కు తొలిసారి టీమిండియా స్క్వాడ్ లో చోటు దక్కింది. 16 మందితో కూడిన ఇండియా జట్టులో దయాల్ చేరడం అతని పట్టుదలకు నిదర్శనం. 2023 ఐపీఎల్ లో రింకూ సింగ్ ధాటికి ఒకదశలో అతని కెరీర్ ముగిసిందనుకుంటే.. అందరి అంచనాలను తలక్రిందుకు చేస్తూ సంవత్సరం తిరిగే సరికీ ఏకంగా భారత జట్టులోని స్థానం సంపాదించాడు. 

ఐపీఎల్ 2023లో భాగంగా ఏప్రిల్ 09న ఆదివారం రోజున గుజరాత్ టైటాన్స్,  కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి  29 పరుగులు అవసరం అనుకున్న క్రమంలో బ్యాటింగ్ లో ఉన్న రింకు సింగ్‌.. గుజరాత్ బౌలర్   చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా సాధన చేసి 2024 ఐపీఎల్  సీజన్ లో సత్తా చాటాడు. అద్భుతమైన బౌలింగ్ తో ఆర్సీబీ జట్టు పప్లే ఆఫ్ కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. 

Also Read:-యూఎస్ ఓపెన్ టైటిల్ విజేత సిన్నర్

ఇదే ఊపులో డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చాటుతూ వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలోనూ అదరగొట్టాడు. ఇండియా-బి తరపున ఆడుతూ ఇండియా- ఏ పై మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 4.. రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసుకున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. తుది జట్టులో యష్ కు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది.