MI vs RCB: యష్ దయాళ్ స్నేక్ డెలివరీ.. రోహిత్ కాదు ఎవరైనా ఔట్ కావాల్సిందే!

MI vs RCB: యష్ దయాళ్ స్నేక్ డెలివరీ.. రోహిత్ కాదు ఎవరైనా ఔట్ కావాల్సిందే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ యష్ దయాళ్ అద్భుతమైన బంతితో రోహిత్ ను బోల్తా కొట్టించాడు. సోమవారం (ఏప్రిల్ 7) వాంఖడే వేదికగా  జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో రెండో ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాలుగో బంతిని దయాళ్.. 137 కి.మీ వేగంతో ఇన్ స్వింగర్ బంతి విసిరాడు. ఈ బంతి పిచ్ మధ్యలో పడి భారీగా లోపలి తిరిగింది. ఈ ఇన్ స్వింగర్ ధాటికి లెగ్ స్టంప్ ఎగిరి పడడం విశేషం. ఈ డ్రీమ్ డెలివరీకి రోహిత్ శర్మ వద్ద సమాధానమే లేకుండా పోయింది. 

క్రికెట్ లో చాలా కాలం తర్వాత ఇలాంటి ఇన్ స్వింగర్ ధాటికి బ్యాటర్ బౌల్డ్ అవ్వడం విశేషం. యష్ దయాళ్ విసిరిన ఈ అద్భుత బంతికి ప్రపంచంలో ఎలాంటి బ్యాటర్ అయినా ఔట్ కావాల్సిందే. అంతకముందు దయాల్ వేసిన రెండు, మూడు బంతులను రోహిత్  శర్మ ఫోర్లు కొట్టి ఓవర్ ను ధాటిగా ఆరంభించాడు. నాలుగో బంతికి మాత్రం దయాల్ తన రివెంజ్ ను తీర్చుకున్నాడు. ఈ టాప్ క్లాస్ డెలివరీకి ముంబై రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ ను  కోల్పోయింది. 9 బంతుల్లో రోహిత్ శర్మ 2 ఫోర్లు, ఒక సిక్సర్ తో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. 

రోహిత్ శర్మతో పాటు రికెల్ టన్(17), విల్ జాక్స్ (22) ఔట్ కావడంతో ముంబై తొలి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (23) తిలక్ వర్మ (5) ఉన్నారు. ముంబై గెలవాలంటే చివరి 10 ఓవర్లలో 138 పరుగులు చేయాలి. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్, హేజల్ వుడ్, కృనాల్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు.