MI vs RCB: రెండు డ్రీమ్స్ నెరవేరిన వేళ: వికెట్ పడగొట్టి ఆటోగ్రాఫ్ అందుకున్న దయాల్

MI vs RCB: రెండు డ్రీమ్స్ నెరవేరిన వేళ: వికెట్ పడగొట్టి ఆటోగ్రాఫ్ అందుకున్న దయాల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ యష్ దయాల్ ఒకే మ్యాచ్ లో తన రెండు కోరికలను తీర్చుకున్నాడు.  ఏప్రిల్ 7, సోమవారం (ఏప్రిల్ 7) ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మొదట రోహిత్ శర్మ వికెట్ తీసిన దయాల్.. ఆ తర్వాత హిట్ మ్యాన్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు 12 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత దయాల్ స్వయంగా రోహిత్ దగ్గరకు వెళ్లి తన జెర్సీపై సంతకం చేయించుకున్నాడు. 

ఆ తర్వాత తన ఇంస్టాగ్రామ్ లో రోహిత్ సంతకం చేసిన జెర్సీని పోస్ట్ చేస్తూ.. "రోహిత్ భయ్యాకు కృతజ్ఞతలు. ఇది నా జీవితంలో మరుపురాని క్షణం" అని పోస్ట్ చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాలుగో బంతిని దయాళ్.. 137 కి.మీ వేగంతో ఇన్ స్వింగర్ బంతి విసిరాడు. ఈ బంతి పిచ్ మధ్యలో పడి భారీగా లోపలి తిరిగింది. ఈ ఇన్ స్వింగర్ ధాటికి లెగ్ స్టంప్ ఎగిరి పడడం విశేషం. ఈ డ్రీమ్ డెలివరీకి రోహిత్ శర్మ వద్ద సమాధానమే లేకుండా పోయింది. దయాల్ ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ వికెట్ తో పాటు సూర్య కుమార్ యాదవ్ వికెట్ పడగొట్టాడు.

Also Read :  శివాలెత్తిన పూరన్, మార్ష్

ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో అద్భుత విజయం అందుకుంది. మొన్న చెపాక్ స్టేడియంలో తొలిసారి చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌పై గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు పదేండ్ల తర్వాత వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌‌ను ఓడించి ఔరా అనిపించింది. విరాట్ కోహ్లీ (42 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), కెప్టెన్ రజత్ పటీదార్ (32 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64) ఫిఫ్టీలతో దంచికొట్టడంతో  సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో ఆర్సీబీ  12 రన్స్ తేడాతో ముంబైపై గెలిచింది. హై స్కోరింగ్ పో రులో  తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 221/5 స్కోరు చేసింది. ముంబై  20 ఓవర్లలో 209/9 స్కోరు చేసి ఓడింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Dayal (@imyash_dayal)