2023 ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఒక్క మ్యాచ్ యష్ దయాల్ కెరీర్ ను పాతాళానికి పడేశాయి. అప్పటివరకు బాగా బౌలింగ్ వేసిన దయాల్..చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సిన దశలో రింకూ సింగ్ ధాటికి వరుసగా 5 సిక్సులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ తో రింకూ సింగ్ హీరోగా మారితే యష్ దయాల్ పై విమర్శలు గుప్పించారు. ఈ దశలో ఈ యువ ప్లేయర్ కెరీర్ ముగిసిందనే కామెంట్స్ కూడా వినిపించాయి.
2023 ఐపీఎల్ మినీ వేలంలో దయాల్ కు రూ. 5 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేయడంతో బయట నుంచి విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే యష్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఒక్కసారిగా దయాల్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. తనలోని వేరియషన్స్ చూపిస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు.
ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో చెన్నై ప్లే ఆఫ్ కు క్వాలిఫై కావాలంటే 17 పరుగులు చేయాల్సిన దశలో ధోనీ, జడేజా లాంటి బెస్ట్ ఫినిషర్స్ ను నిలువరించి వావ్ అనిపించాడు. తొలి బంతికే సిక్స్ ధోనీ సిక్స్ కొట్టినా.. ఆ తర్వాత 5 బంతులకు ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. దీంతో బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకుంది. దీంతో దయాల్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.
తన కొడుకు గురించి యష్ దయాల్ తాజాగా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. "ఐపీఎల్ వేలంలో దయాల్ ను రూ. 5 కోట్లు పెట్టి కొన్నప్పుడు చాలా మంది ట్రోల్స్ చేశారు. కొంతమంది ఆ డబ్బు ఆర్సీబీ కాలవలో విసిరేసిందని అన్నారు". అని దయాల్ తండ్రి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దయాల్ ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఆడిన 13 మ్యాచ్ ల్లో 15 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్లే ఆఫ్స్ లో దయాల్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.