కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్ (Tixic). ఇది అతని కెరిర్ లో 19వ సినిమాగా తెరకెక్కుతోంది. నేడు జనవరి 6న యష్ బర్త్డే స్పెషల్గా టాక్సిక్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
టాక్సిక్ మూవీ నుంచి జనవరి 8న ఉదయం 10 గంటల 25 నిమిషాలకి పవర్ ఫుల్ అప్డేట్ రాబోతోందని పోస్టర్లో తెలిపారు. అలాగే "అతని పేరులేని ఉనికి మీ అస్తిత్వ సంక్షోభం" అనే ట్యాగ్‌లైన్తో రిలీజ్ చేసిన పోస్టర్ చీకటి కథనాన్ని సూచిస్తుంది.
పాతకాలం నాటి కారు ముందు యష్ క్యాప్ పెట్టుకొని నిలబడి స్టైలిష్ గా సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే 'కేజీఎఫ్' తరహాలోనే ఇందులో కూడా యష్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు అర్ధమవుతోంది. అయితే, ఈ మూవీ గోవాలో ఉన్న డ్రగ్ కార్టెల్ చుట్టూ నడిచే యాక్షన్-ప్యాక్డ్ మాఫియా థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో యష్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇదే తనకు కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ. సిస్టర్ సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ గా ఉండబోతోందని సినీ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. యష్ కి అక్కగా హ్యూమా ఖురేషి కనిపించబోతున్నట్లు టాక్.
Also Read : పవర్ ఫుల్గా ఎమర్జెన్సీ ట్రైలర్
Surprises don't knock .. they are unleashed.#TOXIC #TOXICTheMovie @TheNameIsYash #GeetuMohandas @KVNProductions #MonsterMindCreations @Toxic_themovie pic.twitter.com/Yj3zeg1GXE
— KVN Productions (@KvnProductions) January 6, 2025
కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు. వీలైనంత త్వరగా టాక్సిక్ షూటింగ్ కంప్లీట్ చేసి 2025 ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.