
కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ హీరో యశ్.. ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. యశ్ కెరీర్‌లో ఇది 19వ సినిమా. మరోవైపు ఓ పెస్టీజియస్ హిందీ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నాడు యశ్. రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ‘రామాయణ’ చిత్రంలో రావణుడిగా కనిపించబోతున్నాడు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దీనికి దర్శకుడు.
రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రాముడు, సీత పాత్రలకు సంబంధించి కాంబినేషన్ సీన్స్ ఇప్పటికే పూర్తిచేశారు. ఈ నెలాఖరు నుంచి యశ్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఉజ్జయినీ మహాకాలేశ్వర్ దేవాలయాన్ని దర్శించుకున్నాడు యశ్. ఈ సినిమా షూట్‌లో పాల్గొనడానికి ముందు పరమేశ్వరుడి ఆశీస్సులు తీసుకునేందుకే యశ్ ఉజ్జయినీ వెళ్లారనే టాక్ వినిపిస్తోంది.