
కన్నడ స్టార్ యష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్, హాలీవుడ్ నటులు ఇందులో నటిస్తుండటంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 19న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడతో పాటు పలు ఇండియన్ భాషలు, ఇంగ్లీష్‌లోనూ సినిమా విడుదల కానుంది. ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి కన్నడ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లో నిలిచింది. గ్లోబల్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో షూట్ చేస్తున్నామని మేకర్స్ చెప్పారు.