Toxic : యశ్ సరికొత్త ప్రయోగం .. టాక్సిక్‌లో హాలీవుడ్‌ స్టయిల్‌ యాక్షన్‌ సీన్లు!

Toxic : యశ్ సరికొత్త ప్రయోగం ..  టాక్సిక్‌లో హాలీవుడ్‌ స్టయిల్‌ యాక్షన్‌ సీన్లు!

కన్నడ స్టార్ యశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టాక్సిక్‌‌‌‌’.  గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్‌‌‌‌, కన్నడతో పాటు పలు ఇండియన్‌‌‌‌ భాషల్లో విడుదల కానుంది.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌ జేజే పెర్రీ ఈ సినిమాకు యాక్షన్‌‌‌‌ సీన్స్ కంపోజ్ చేస్తున్నాడు. హాలీవుడ్ యాక్షన్‌‌‌‌ మూవీస్‌‌‌‌ అయిన జాన్‌‌‌‌ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌‌‌‌ చిత్రాలతో పాటు అవతార్ 2, జెమిని మ్యాన్, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్స్‌‌‌‌ 5 చిత్రాలకు జేజే పెర్రీ వర్క్ చేశాడు.  ఇటీవల యాక్షన్ సీన్స్‌‌‌‌ కంప్లీట్ చేసిన పెర్రీ.. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించి తన అనుభవాలను షేర్ చేసుకున్నాడు. ‘యశ్ లాంటి మంచి ఫ్రెండ్‌‌‌‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.  

ఇప్పటికే నేను యూరప్‌‌‌‌లోని స్టార్స్‌‌‌‌తో కలిసి వర్క్ చేశాను.  ఇప్పుడు యశ్‌‌‌‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.  సినిమా చాలా అద్భుతంగా ఉండబోతోంది. స్టంట్స్‌‌‌‌పై ఫుల్‌‌‌‌ కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నాం. అంతేకాకుండా గర్వంగా కూడా ఉంది’ అని మూవీ సెట్స్‌‌‌‌లో యశ్‌‌‌‌తో కలిసున్న ఫొటోను షేర్ చేశాడు.  నయనతార, కియారా అద్వాని ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు హిందీ చిత్రం ‘రామాయణ’లో రావణుడిగా యశ్ నటిస్తున్నాడు.